Skip to main content

Posts

Showing posts from August, 2020

subhavela

శుభవేళ – స్తోత్రబలి
తండ్రీ దేవా – నీకేనయ్యా
ఆరాధన – స్తోత్రబలి
తండ్రీ దేవా – నీకేనయ్యా
తండ్రీ దేవా – నీకేనయ్యా (2) ||శుభవేళ||

ఎల్ షడ్డాయ్ – ఎల్ షడ్డాయ్-
సర్వ శక్తిమంతుడా (2)
సర్వ శక్తిమంతుడా -
ఎల్ షడ్డాయ్ ఎల్ షడ్డాయ్ (2) 
||శుభవేళ||

ఎల్ రోయి – ఎల్ రోయి – 
నన్నిల చూచువాడా (2)
నన్నిల చూచువాడా – 
ఎల్ రోయి ఎల్ రోయి (2)
||శుభవేళ||

యెహోవా షమ్మా – 
మాతో ఉన్నవాడా (2)
మాతో ఉన్నవాడా – 
యెహోవా షమ్మా (2) 
||శుభవేళ||

యెహోవా షాలోం – 
శాంతి నొసగు వాడా (2)
శాంతి నొసగువాడా – 
యెహోవా షాలోం (2) 
||శుభవేళ||

nevunte naaku chaalu yessaya

నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీవెంటే నేను ఉంటానేసయ్యా (2)

నీ మాట చాలయ్యా 
నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా 
నీ నీడ చాలయ్యా (2)

ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ
ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2)

బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ
అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2)

ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా
ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2) 

నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేమియు కాదిల సమానము (2)

Yehova na balama

యెహోవా నా బలమా
యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం (2) 

నా శత్రువులు నను చుట్టిననూ
నరకపు పాశములరికట్టిననూ (2)
వరదవలె భక్తిహీనులు పొర్లిన (2)
విడువక నను ఎడబాయని దేవా (2)


మరణపుటురులలో మరువక మొరలిడ
ఉన్నతదుర్గమై రక్షనశృంగమై (2)
తన ఆలయములో నా మొఱ్ఱ వినెను (2)
ఆదరెను ధరణి భయకంపముచే (2)


నా దీపమును వెలిగించువాడు
నా చీకటిని వెలుగుగా చేయును (2)
జలరాసులనుండి బలమైన చేతితో (2)
వెలుపల చేర్చిన బలమైన దేవుడు (2)


పౌరుషముగల ప్రభు కొపింపగా
పర్వతముల పునాదులు వణకెను (2)
తన నోటనుండి వచ్చిన అగ్ని (2)
దహించివేసెను వైరులనెల్లన్ (2)             
||యెహోవా||

మేఘములపై ఆయన వచ్చును
మేఘములను తన మాటుగ జేయును (2)
ఉరుముల మెరుపుల మెండుగ జేసి (2)
అపజయమిచ్చును అపవాదికిని (2)       
||యెహోవా||

దయగలవారిపై దయ చూపించును
కఠినులయెడల వికటము జూపును (2)
గర్విష్టుల యొక్క గర్వమునణుచును (2)
సర్వమునెరిగిన సర్వాధికారి (2)             
||యెహోవా||

నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును
ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి (2)
రక్షణ కేడెము నాకందించి (2)
అక్షయముగ తన పక్షము జేర్చిన (2)     
||యెహోవా||

యెహోవా జీవముగల దేవా
బహుగా స్తుతులకు అర్హుడ నీవే (2)
అన్యజనులలో ధన్యత చూపుచు (2)
హల్లెలూయ స్తుతిగానము చేసెద (2)       
||యెహోవా||

abhrahamu devudavu

అబ్రాహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు
యాకోబు దేవుడవు నాకు చాలినదేవుడవు
యేసయ్య నా యేసయ్య  యేసయ్య నా యేసయ్య

1. అబ్రాహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను   
పునాదుల గల పట్టణము కై వేచి జీవించెను   
అబ్రాహాముకు చాలిన దేవుడా నీవైన్నయ్య
యేసయ్య నా యేసయ్య  యేసయ్య నా యేసయ్య

2. ఇస్సాకు విధేయుడై బలీయగమాయెను   
వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను   
ఇస్సాకు చాలిన దేవుడా నీవైన్నయ్య
యేసయ్య నా యేసయ్య  యేసయ్య నా యేసయ్య

3.  యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను   
యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను   
యాకోబుకు చాలిన దేవుడా నీవైన్నయ్య
యేసయ్య నా యేసయ్య  యేసయ్య నా యేసయ్య

solipovaladhu

సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు
నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2)         ||సోలిపోవలదు||

ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను
చుట్టుముట్టినా (2)
ప్రియుడు నిన్ను చేరదీసిన
ఆనందం కాదా (2)           ||సోలిపోవలదు||

శోధనలను జయించినచో
భాగ్యవంతుడవు (2)
జీవ కిరీటం మోయువేళ
ఎంతో సంతోషము (2)       ||సోలిపోవలదు||

వాక్కు ఇచ్చిన దేవుని నీవు
పాడి కొనియాడు (2)
తీర్చి దిద్దే ఆత్మ నిన్ను
చేరే ప్రార్ధించు (2)                ||సోలిపోవలదు||

Mukthi niche

 ముక్తి నిచ్చె యేసునామం -   

 శాంతి నిచ్చె యేసునామం


సిలువపై నీవు మరణించావు -
పాపము బాపు.... మాదు

వేదనలెన్నో కలిగిన నాకు -
వెలుగును చూపావు.... నీవు

రోగము లెన్నో కలిగిన నాకు -
స్వస్థత నిచ్చావు...... నీవు

భువిపై నీవు జన్మించావు -
సిలువపై విశ్రమించావు.... నీవు

మన పాపములను పరిహరించు -
యేసు బలి యాయె....మనకై

anukshnamu

అనుక్షణం నిన్నే కొలుతు-
పునరుత్థానుడా 
పునరుత్థానుడా - పరిశుద్ధుడా

అధికారులైనా - దేవదూతలు
వస్త్రహీనతైనా - ఉపద్రవమైనా
కరువైనా - ఖడ్గమైనా

రోగినైన నాకై - త్యాగమైనావే
ద్రోహినైన నాకై - దాహము గొన్నావే 
ఊహకందదయ్యా- నీ ధర్మము

శ్రమ లైన - హింసలైనా
రాబోవుననా - ఉన్నవైనా
మరణమైనా - జీవమైనా

ఒంటరినై నా- కంట నీరు తుడిచావే
కంటి పాపలా నీ - యింట చేర్చుకొన్నావే 
మంటినైన నన్ను నీ - బంటుగా చేసావే

enduko nanithaga neevu

 ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా

అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2)

నా పాపము బాప నరరూపివైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే
నా స్థానములో నీవే (2)         ||ఎందుకో||

నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివసించుమన్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి
నీ కొరకై నీ కృపలో (2)           ||ఎందుకో||

నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు
నను దాచియున్నావు (2)       ||ఎందుకో|| 

నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
నీవు నేను ఏకమగువరకు
నన్ను విడువనంటివే (2)        ||ఎందుకో||

నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం
నేనేమి చెల్లింతున్ (2)             ||ఎందుకో||

prabhu yesu na rakshaka

 ప్రభు యేసు నా రక్షకా

నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ (2)
అల్ఫయు నీవే – ఒమేగయు నీవే (2)          ||ప్రభు యేసు||

ప్రియుడైన యోహాను పత్మాసులో
ప్రియమైన యేసు నీ స్వరూపము (2)
ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె
ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2)          ||ప్రభు యేసు||

లెక్కలేని మార్లు పడిపోతిని
దిక్కులేనివాడ నేనైతిని (2)
చక్కజేసి నా నేత్రాలు దెరచి
గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2)             ||ప్రభు యేసు||

ఎరిగి యెరిగి నే చెడిపోతిని
యేసు నీ గాయము రేపితిని (2)
మోసపోతి నేను దృష్టి దొలగితి
దాసుడ నన్ను జూడనిమ్ము (2)             ||ప్రభు యేసు||

kumari o kumari

కుమ్మరి ఓ కుమ్మరి-
జగతుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక -
చల్లగ చూడుమయ్యా
ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా

పనికిరాని పాత్రనని – 
పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా – 
నన్ను నింపుమా (2)
సువార్తలోని పాత్రలన్నీ – 
శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగానుండు పాత్రగజేసి – 
సత్యముతో నింపుము తండ్రి
ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి                   
 ||కుమ్మరి||

విలువలేని పాత్రను నేను – 
కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో – 
వెలుగొందు పాత్రగజేసి (2)
ఆటంకములనుండి తప్పించి నన్ను – 
ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను – 
సరిచేసి వాడుమయ్యా
ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా                            
||కుమ్మరి||

లోకాశతో నిండి ఉప్పొంగుచూ – 
మార్గంబు నే దప్పితిన్
మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే – 
మనశ్శాంతి కోల్పోతిని (2)
పోగొట్టుకున్న పాత్రయనుచు – 
పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే – 
నీ పాదంబుల్ పట్టితిన్
ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్                            
||కుమ్మరి||

Neethi suryuda

నీతి సూర్యుడా -యేసు
ప్రాణ నాథుడా.. రావయ్యా

నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా
హల్లెలూయా.......
ఎన్నడైన నన్ను మరచిపోయావా
హల్లెలూయా.......
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా

యుగయుగములకు ప్రభువా
తరతరములకు రాజువా (2)
శరణటంచు నిన్ను వేడ
కరములెత్తి నిన్ను పిలువ (2)
పరమ తండ్రి నన్ను చేర వచ్చావా        
||నిన్న||

వేల్పులలోనే ఘనుడా
పదివేలలో అతిప్రియుడా (2)
కృపా సత్య సంపూర్ణుడా
సర్వ శక్తి సంపన్నుడా (2)
పరమ తండ్రి నన్ను చేర వచ్చావా       
||నిన్న||

Yudha Veeruda

యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలు తేనెలా నగరుకు

వెట్టి చాకిరి పోయె వెనుకకు - విడుదలిచ్చెగా రక్తం మనలకు

లేదు మనకిక అపజయం - యేసు రక్తమే మన జయం

హల్లెలూయ హోసన్నా -3 మనదే విజయం -2

యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలు తేనెలా నగరుకు

వెట్టి చాకిరి పోయె వెనుకకు విడుదలిచ్చెగా రక్తం మనలకు

 
1. ఏదేమైనా గాని ఎదురేమున్న గాని ముందుకే పయనము

ఎర్ర సంద్రమైనా ఎరికో గోడలైన మేం వెనుకడుగు వేయము

యేసుడే సత్య దైవం అంటూ - సిలువను చాటుదాం

అడ్డుగా ఉన్న సాతాను కోటలన్నిటి కూల్చుదాం

లేదు మనకిక అపజయం యేసు రక్తమే మన జయం

హల్లెలూయ హోసన్నా -3 మనదే విజయం -2
యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలు తేనెలా నగరుకు

వెట్టి చాకిరి పోయె వెనుకకు విడుదలిచ్చెగా రక్తం మనలకు

2. పగలు మేఘ స్తంభం రాత్రి అగ్ని స్తంభమై - ప్రభువు తోడుండగా

చింతయే లేదు ఏ కొదువ లేదు - నిస్సత్తువే రాదుగా

ఆకలి తీర్చ మన్నా కురియును - యేసుని నీడలో

దాహము తీర్చ బండయె చీలును - కలువరి సిలువలో
లేదు మనకిక అపజయం యేసు రక్తమే మన జయం
హల్లెలూయ హోసన్నా -3 మనదే విజయం -2
యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలు తేనెలా నగరుకు
వెట్టి చాకిరి పోయె వెనుకకు విడుదలిచ్చెగా రక్తం మనలకు

3. గొర్రెపిల్ల రక్తం యేసు దివ్య వాక్యం మా కిచ్చెను బహుబలం

శక్తి చేత కాదు బలము చేత కాదు - ప్రభు ఆత్మతో గెలిచెదం

యేసుని గొప్ప వాగ్ధానములే - నింపెను నిబ్బరం

యేసుని యందు విశ్వాసమె మా విజయపు సూచకం

లేదు మనకిక అపజయం యేసు రక్తమే మన జయం

హల్లెలూయ హోసన్నా -3 మనదే విజయం -2

Nazareyuda Na yesayya

నజరేయుడా నా యేసయ్య
ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని
గళమెత్తి నీ కీర్తి నే చాటెద    

ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2)
శూన్యములో ఈ భూమిని
వ్రేలాడదీసిన నా యేసయ్య (2)
నీకే వందనం నీకే వందనం (2)     

అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2)
జలములలోబడి నే వెళ్ళినా
నన్నేమి చేయవు నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2)    

సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2)
సీయోనులో నిను చూడాలని
ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2)       

Na prema Geethamu

ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన // 2

నా ప్రేమ గీతం, నీవే యేసు నాధ // 2
నా జీవితం మించిన, శ్రేష్ఠుడవు నీవే // 2
ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన // 2

నీకు సమము ఎవ్వరులేరు, వివరింప యేసు దేవా //2
జీవమా, నా సర్వమా, నీపై నేను అనెదను // 2
ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన // 2

నన్నింత ప్రేమింప, ఎవ్వరి సాధ్యం యేసు దేవా, // 2
ప్రియతమా, నా స్నేహమా, నీలో నేను చేరెదను // 2
ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన // 4

Hallelujah Sthuthi Mahima


హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2)
ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

అల సైన్యములకు అధిపతియైన
ఆ దేవుని స్తుతించెదము (2)
అల సంద్రములను దాటించిన
ఆ యెహోవాను స్తుతించెదము (2)

ఆకాశమునుండి మన్నాను పంపిన
దేవుని స్తుతించెదము (2)
బండనుండి మధుర జలమును పంపిన
ఆ యెహోవాను స్తుతించెదము (2)

Aradhanaku Yogyuda

ఆరాధనకు యోగ్యుడా
నిత్యము స్తుతియించెదను
నీ మేలులను మరువకనే 
ఎల్లప్పుడు స్తుతి పాడెదను (2)
ఆరాధన ఆరాధన (2)
నీ మేలులకై ఆరాధన
నీ దీవెనకై ఆరాధన (2)
ఆరాధన ఆరాధన (2)

దినమెల్ల నీ చేతులు చాపి
నీ కౌగిలిలో కాపాడుచుంటివే (2)
నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై
నా పూర్ణ హృదయముతో సన్నుతింతును (2)
ఆరాధన ఆరాధన (2)
నీ ప్రేమకై ఆరాధన
నీ జాలికై ఆరాధన (2)
ఆరాధన ఆరాధన (2)

ధనవంతులుగా చేయుటకు
దారిద్య్రత ననుభవించినావు (2)
హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా
పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను (2)
ఆరాధన ఆరాధన (2)
నీ కృప కొరకై ఆరాధన
ఈ స్థితి కొరకై ఆరాధన (2)
ఆరాధన ఆరాధన (2)          ||ఆరాధనకు||

Ninnu Sthuthinchina Chalunu

నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో
నిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2)
ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా
నీ సన్నిధిలో…
నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు      ||నిను||

స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా
స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        ||నిను||

ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా
స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        ||నిను||

ఆరాధ్య దైవము నీవేనయ్యా
ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        ||నిను||

ఆదిసంభూతుడవు నీవేనయ్యా
ఆదరించు దేవుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        ||నిను||

Vandhanam Prabhu Yesuke

వందనం ప్రభు యేసునికే
 వందనం పరిశుద్ధునికే 
 వందనం ప్రభు యేసుని ఇచ్చెనుగా... మనకు
 ఇదిగో... 
 బలహీనుడు - బలవంతుడూ 
 ధనహీనుడు - ధన వంతుడూ
 ప్రభువే - ఆశ్చర్యకరుడు
 మనకు... వందనం

Yesayya Namamulo

యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
నమ్మితే చాలు నీవు – పొందుకుంటావు శక్తిని (2)        ||యేసయ్య||

పాపాలను క్షమియించే – శక్తి కలిగినది యేసయ్య నామం
పాపిని పవిత్రపరచే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)        ||యేసయ్య||

రోగికి స్వస్థతనిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం
మనసుకు నెమ్మదినిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)        ||యేసయ్య||

దురాత్మలను పారద్రోలే – శక్తి కలిగినది యేసయ్య నామం
దుఃఖితులను ఆదరించే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)        ||యేసయ్య||

సృష్టిని శాసించగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం
మృతులను లేపగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం (2)        ||యేసయ్య||

పాతాళాన్ని తప్పించే – శక్తి కలిగినది యేసయ్య నామం
పరలోకానికి చేర్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)        ||యేసయ్య||

Prema Purnudu

ప్రేమా పూర్ణుడుప్రాణ నాథుడు
నను ప్రేమించి ప్రాణమిచ్చెను (2)
నే పాడెదన్ – కొనియాడెదన్ (3)
నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును (4)

లోయలకంటే లోతైనదినా యేసు ప్రేమ
గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ (2)
యేసుని ప్రేమ వెల యెంతో
ఇహమందైనా పరమందైనా (2)
వెల కట్టలేని కలువరిలో ప్రేమ
వెలియైన ప్రేమ నాకై బలియైన ప్రేమ – (2)      ||ప్రేమా||

మరణముకంటె బలమైనది – పునరుత్ధాన ప్రేమ
మరణపు ముల్లును విరచినది – బలమైన ప్రేమ (2)
రక్తము కార్చి రక్షణ నిచ్చి
ప్రాణము పెట్టి పరముకు చేర్చే (2)
గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ
బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ – (2)      ||ప్రేమా||

Prabhu Va ni Karyamulu

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి    
దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి(2X)
నే పాడెదన్ నేచాటెదన్ నీదు నామం భువిలో    
సన్నుతించెదనూ నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా(2X)

1.
భరియింపరాని దుఃఖములు యిహమందు నను చుట్టిన    
నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి     (2X)
నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి    
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ..    
...సన్నుతించెదనూ...(2X)

2.
లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో    
నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి     (2X)
నిర్దోషిగ చేయుటకై నీవు దోషివైనావు    
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ..    
...సన్నుతించెదనూ...(2X)
   

    

 

Preminchedhan Adikamuga

ప్రేమించెదన్ అధికముగా
ఆరాధింతున్ ఆసక్తితో (2)

నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్
పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధన ఆరాధనా
ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2)

ఎబినేజరే ఎబినేజరే
ఇంత వరకు ఆదుకొన్నావే (2)
ఇంత వరకు ఆదుకొన్నావే   || నిన్ను పూర్ణ ||

ఎల్రోహి ఎల్రోహి
నన్ను చూచావే వందనమయ్యా (2)
నన్ను చూచావే వందనమయ్యా    || నిన్ను పూర్ణ ||

యెహోవా రాఫా యెహోవా రాఫా
స్వస్థపరిచావే వందనమయ్యా (2)
స్వస్థపరిచావే వందనమయ్యా       || నిన్ను పూర్ణ ||

Ne Krupa Chalunu

నీ కృప చాలును
నీ ప్రేమ చాలును
నీవు నాకు తోడుంటే చాలును యేసు (2)
నీవు లేని జీవితం అంధకార బంధురం (2)
నీవు నాకు తోడుంటే చాలును యేసు (2)

శోధనలు ఎన్నియో వేదనలు ఎన్నియో
నన్ను కృంగదీయు సంకటములెన్నియో (2)
నీ ప్రేమ వర్షం నా స్థితిని మార్చెగా (2)
నా జీవితాంతము నీలోనే నిలిచెదన్
నా జీవితాంతము నీతోనే నడిచెదన్
నీవు నాకు తోడుంటే చాలును యేసు (2)

నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధన
నా హృదయ ఆలాపన అందుకో దేవా (2)
నిను పోలి నేను ఈ లోకమందు
నీ సాక్షిగాను నీ మహిమ చాటెదన్ (2)
నీ దివ్య వాక్యం ఈ జగాన చాటెదన్
నీ ఆత్మ అభిషేకం నాకు నొసగు దేవా (2)

నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధన
నా హృదయ ఆలాపన అందుకో దేవా (2)

orrana orrana

ఓరన్న…  ఓరన్న
యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా
యేసే ఆ దైవం చూడన్నా    ||ఓరన్న||

చరిత్రలోనికి వచ్చాడన్నా 
పవిత్ర జీవం తెచ్చాడన్నా  (2)
అద్వితీయుడు ఆదిదేవుడు
ఆదరించును ఆదుకొనును (2)              ||ఓరన్న||

పరమును విడచి వచ్చాడన్నా
నరులలో నరుడై పుట్టాడన్నా (2)
పరిశుద్దుడు పావనుడు
ప్రేమించెను ప్రాణమిచ్చెను (2)             ||ఓరన్న||

సిలువలో ప్రాణం పెట్టాడన్నా 
మరణం గెలిచి లేచాడన్న  (2)
మహిమ ప్రభూ మృత్యుంజయుడు
క్షమియించును జయమిచ్చును (2)     ||ఓరన్న||