Skip to main content

Posts

Showing posts from March, 2022

prema nee adbutha

Prema née adbutha Prema
Neevu naa koraku bali aithiva
Premai naa siksha nuvvu mosi Siluvaithiva yesayya Naakai nuvvu janminchi, maargamu choopavayya Neetho samamuganu cheyyutakai Karunanu nuvvu chupinchi, nannu kshamiyinchithivi Gora paapi nayya yesayya Nindanu ne mopina, dhooshana ne chesina Ummi dhandinchina, née premela Mullanu ne guchina, siluvanu ne vesina Gunupamu ne guchina, née premela


Naa roopam, naa deham Naa jeevam, naa daivam Nevey naaku sarvam, neevey Naa maargam, naa Satyam Naa jeevam, naa sneham Neevey naaku sarvam, neevey Siluvalo nannu thapinchi, sila ga nuvvu maarithivi Aa siksha naadey nayya, yesayya Rakthamu nuvvu chindinchi, vimochinchithivey Neela maarchitivey, yesayya

sevakulara

 పల్లవి :  సేవకులారా సువార్తికులారా ఏసయ్యా కోరుకున్నా శ్రమికులారా 
               సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము 

   అ.ప :  ఉన్నత పనికై మమ్మును పిలచినా దేవా 
               మా కొరకై నీ ప్రాణం అర్పించితివి 
               నీలో నిలిచి వుండుటే మా భాగ్యము 
               నీ కొరకై జివించెదము                                                         || సేవకులారా ||
1  : దైవాజ్ఞాను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు 
      ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని ఇల విడిచారు 
       మా ఆత్మలు రక్షించుటకు హతసాక్షులు మీరైయ్యారు 
      నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరున్నారు               ||  అ.ప || ||సే ||

2 : సంఘమును కాపాడుటలో  కాపరులుగా మీరున్నారు
     సువార్తకై  పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు  
     మీ ప్రేమను ఎరుగని వారు ఆన్యాయముగా మిము చంపారు
     మీ ఈ త్యాగము మేము ఎన్నటికి మరిచిపపోమూ........            || సే ||

౩: సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు 
     ఆకలితో మోకాళ్ళున్ని సంఘమును పోషించారు 
     మాకు మాదిరి చూపించుటకు క్రిస్తుని పొలి జీవించారు 
     మీ జత పనివారమే మేము మీ జడలో ఇకనుంచి                   ||  అ.ప || ||సే ||         

prabhoo nee vaadanu neevu naa prabhudavani nee korakai jeevimthunu

ప్రభూ నీ వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును
మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను

1. ప్రభువా యెరిగితిని లోకమంత మోసమని
చూపితివి సమాధాన నిరీక్షణ నా కిలలో
కృతజ్ఞత కలిగి (2) - నీవైపే చూచెదను
నీయందే నిలిచి యుండి నీయాజ్ఞల పాలింతును

2. నా ముందు నడిచే ప్రభూ నిన్ను వెంబడించెదను
నీవు నా తోడనుండ మరచెదను దుఃఖమును
నెమ్మదిని పొంది యిల (2) కన్నీరు - కార్చనిక
నీవే నా సర్వమని నీయందే బలపడెద

3. యేసుని సిలువజూచి విజయమును పొందెదను
సహింతును సంతసముగ నీ కొరకు అన్నింటిని
నిన్ను నే నమ్మెదను (2) - నీతోనే సాగెదను
నీ రెక్కలచాటు నేనుండ భయపడను

4. మరణనది యొద్దకు సంతసముగ వచ్చెదను
మృత్యువు బారినుండి జీవమునకు దాటింతువు
రక్షకుని చూఛెదను (2) - నన్నాయన చేర్చుకొనున్
తక్షణమే తన రూపమునకు మార్పుచెందెదను

5. అగమ్య జ్యోతియందు ఘనముగ నే ప్రవేశించి
దూతలు, పరిశుద్ధులు, భక్తులనే చూచెదను
నే సంతసించెదను (2) - ప్రభువుతోడ నుండెదను
నిరీక్షణ యిదియే ఆయనతో నేనుందును

Margamu choopumu intiki

మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి (2)

పాప మమతల చేత – పారిపోయిన నాకు
ప్రాప్తించె క్షామము
పశ్చాత్తాప్పమునొంది – తండ్రి క్షమ కోరుచు
పంపుము క్షేమము (2)
ప్రభు నీదు సిలువ – ముఖము చెల్లని నాకు
పుట్టించె ధైర్యము (2)                    ||మార్గము||

ధనమే సర్వంబనుచు- సుఖమే స్వర్గంబనుచు
తండ్రిని వీడితి
ధరణి భోగములెల్ల – బ్రతుకు ధ్వంసము జేయ
దేహీ నిను చేరితి (2)
దేహీ అని నీ వైపు – చేతులెత్తిన నాకు
దారిని జూపుము (2)     ||మార్గము||

దూర దేశములోన – బాగుందుననుకొనుచు
తప్పితి మార్గము
తరలిపోయిరి నేను – నమ్మిన హితులెల్ల
తరిమే దారిద్య్రము (2)
దాక్షిణ్య మూర్తి నీ – దయ నాపై కురిపించి
ధన్యుని చేయుము (2)                  ||మార్గము||

అమ్ముకొంటిని నేను – అధముడొకనికి నాడు
ఆకలి బాధలో
అన్యాయమయిపోయే – పందులు సహ వెలివేయ
అలవడెను వేదన (2)
అడుగంటె అవినీతి – మేల్కొనియె మానవత
ఆశ్రయము గూర్చుము (2)        ||మార్గము||

కొడుకునే కాదనుచు – గృహమే చెరసాలనుచు
కోపించి వెళ్ళితి
కూలివానిగనైన – నీ యింట పని చేసి
కనికరమే కోరుదు (2)
కాదనకు నా తండ్రి – దిక్కెవ్వరును లేరు
క్షమియించి బ్రోవుము (2)        ||మార్గము||

నా తండ్రి నను జూచి – పరుగిడిచూ ఏతెంచి
నాపైబడి ఏడ్చెను
నవ జీవమును గూర్చి – ఇంటికి తోడ్కొని వెళ్లి
నన్నూ దీవించెను (2)
నా జీవిత కథయంత – యేసు ప్రేమకు ధరలో
సాక్ష్యమై యుండును (2)                    ||మార్గము||

Yehovaa Needu Melulanu

 యెహోవా నీదు మేలులను – ఎలా వర్ణింపగలను
కీర్తింతును నీదు ప్రేమను – దేవా అది ఎంతో మధురం
దైవం నీవయ్యా పాపిని నేనయ్యా
నీదు రక్తముతో నన్ను కడుగు
జీవం నీవయ్యా జీవితం నీదయ్యా
నీదు సాక్షిగా నన్ను నిలుపు
కారణ భూతుడా పరిశుద్ధుడా
నీదు ఆత్మతో నన్ను నింపు
మరనాత యేసు నాథా
నీదు రాజ్యములో నన్ను చేర్చు

ఘనుడా సిల్వ ధరుడా
అమూల్యం నీదు రుధిరం (2) ఓ…
నిన్ను ఆరాధించే బ్రతుకు ధాన్యం
నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం
ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం
సర్వోన్నతుడా నీకే సర్వం          ||యెహోవా||

ప్రియుడా ప్రాణ ప్రియుడా
వరమే నీదు స్నేహం (2)
నా రక్షణకై పరమును వీడే
నా విమోచనకై క్రయ ధనమాయె
ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం
పరమాత్ముడా నీకే సర్వం         ||యెహోవా||

Anthaa Naa Meluke

నేనెల్లప్పుడు యెహోవను
సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి
నా నోట నుండున్ (2)

అంతా నా మేలుకే
ఆరాధన యేసుకే
అంతా నా మంచికే
తన చిత్తమునకు తల వంచితే
ఆరాధన ఆపను
స్తుతియించుట మానను (2)


కన్నీళ్లే పానములైనా
కఠిన దుఃఖ బాధలైనా
స్థితి గతులే మారినా
అవకాశం చేజారినా (2)
మారదు యేసు ప్రేమ 
నిత్యుడైన తండ్రి ప్రేమ (2)
మారదు యేసు ప్రేమ
నిత్యుడైన తండ్రి ప్రేమ (2) 

ఆస్తులన్ని కోల్పోయినా
కన్నవారే కనుమరుగైనా
ఊపిరి భరువైనా
గుండెలే పగిలినా (2)
యెహోవా ఇచ్చెను
యెహోవా తీసుకొనెను (2)
ఆయన నామమునకే 
స్తుతి కలుగు గాక (2)

అవమానం ఎంతైనా
నా వారే కాదన్నా
నీవు తప్ప ఎవరున్నారు
ఆకాశమందున (2)
నీవు నాకుండగా 
ఏది నాకక్కర లేదు (2)
నీవు నాకుండగా
ఏది నాకక్కర లేదు (2) 

ఆశలే సమాధియైనా
వ్యాధి బాధ వెల్లువైనా
అధికారం కొప్పుకొని 
రక్షణకై ఆనందింతును (2)
నాదు మనస్సు నీ మీద
ఆనుకొనగా ఓ నాథా (2)
పూర్ణ శాంతి నే పొంది
నిన్నే నే కీర్తింతున్ (2) 

చదువులే రాకున్నా
ఓటమి పాలైనా
ఉద్యోగం లేకున్నా
భూమికే భరువైనా (2)
నా యెడల నీ తలంపులు
\ఎంతో ప్రియములు (2)
నీవుద్దేశించినది
నిశ్ఫలము కానేరదు (2)

సంకల్పన పిలుపొంది
నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి
మేలుకై జరుగును (2)
యేసుని సారూప్యము
నేను పొందాలని (2)
అనుమతించిన ఈ
\విలువైన సిలువకై (2)

నీవు చేయునది
నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను
తెలిసికొందును (2)
ప్రస్తుతము సమస్తము
దుఃఖ కరమే (2)
అభ్యసించిన నీతి
సమాధాన ఫలమే (2)       ||అంతా||

Parishuddhudu na devudu

పరిశుధుడు నా దేవుడు 
గొప్ప దేవుడు నిరంతరము వుండు వాడు
ఆత్మస్వరూపి సత్యదేవుడు
నిత్యనివాసి మృతుంజయుడు
హోసన్నా హోసన్నా 
హోసన్నా హోసన్నా పాడెద

Verse 1
బలవంతుడవు యేసు అబిషేక్తుడవు క్రీస్తు నీ ఆత్మ శక్తినివ్వు
నీ ప్రేమే శాశ్వతమూ నీ కృపయే నీరంతరమూ చాలునూ
యేసయ్యా నా దేవా యేసయ్య నా రుజువు నేవీ
హోసన్నాహోసన్నాహోసన్నా హోసన్నా పాడెద

అద్భుతములు చేయువాడవూ నేవీ -ఆశ్చర్యములు చేయువాడవూ నేవీ
పరిశుద్దుడైన దేవునికే మహిమ కలుగును యుగయుగములవరకు దేవునికే స్తోత్రము చెల్లునూలు

హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా నా రుజువు నేవీ యేసయ్య నా దేవా యేసయ్య  నా రుజువు నేవీ
హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా పాడెద

NEEVE NA AASHA- NEEVE NA SWASA

 నీవే నా ఆశ – నీవే నా శ్వాస
నీవే లేని నేను – లేనే లేను (x2)
యేసయ్యా ఆ ఆ ఆ… యేసయ్యా ఆ ఆ ఆ (x2)

1.అర్పించావు జీవం – నా కొరకై
ప్రకాశమానం నీవై – నను వెలిగించావు (x2) ||నీవే||

2.లెక్కింప జాలని సంతోషం – నా శోకానికి ప్రతిగా
అర్పించిన నీ బలియాగం – నే మరువలేను (x2) ||నీవే||

Aadhaaram Neevenayyaa

ఆధారం నీవేనయ్యా (2)
కాలం మారినా కష్టాలు తీరినా
కారణం నీవేనయ్యా
యేసయ్యా కారణం నీవేనయ్యా         
||ఆధారం||

లోకంలో ఎన్నో జయాలు
చూసాను నేనింత కాలం (2)
అయినను ఎందుకో నెమ్మది లేదు (2)
సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది       
||ఆధారం||

ఐశ్వర్యం కొదువేమి లేదు
కుటుంబములో కలతేమి లేదు (2)
అయినను ఎందుకో నెమ్మది లేదు (2)
సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది         
||ఆధారం||

నీ సేవకునిగా జీవింప
హృదయంలో ఉన్నకోర్కెలను (2)
హృదయము నిచ్చావు నెమ్మది నొందా (2)
సాక్షిగా జీవింతును
హల్లేలూయ సాక్షిగా జీవింతును          
||ఆధారం||

Naa Prana priyuda Yesu Raja

నా ప్రాణప్రియుడా యేసురాజా
అర్పింతును నా హృదయార్పణ
విరిగి నలిగిన ఆత్మతోను
హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా

అద్భుతకరుడా ఆలోచన
ఆశ్చర్య సమాధాన ప్రభువా
బలవంతుడా బహుప్రియుడా
మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్          
||నా ప్రాణ||

విమోచన గానములతో
సౌందర్య ప్రేమ స్తుతులతో
నమస్కరించి ఆరాధింతున్
హర్షింతును నే పాడెదను నా ప్రభువా               
||నా ప్రాణ||

రక్షణాలంకారములను
అక్షయమగు నీ యాహారమున్
రక్షకుడా నాకొసగితివి
దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును              
||నా ప్రాణ||

వాగ్ధానముల్ నాలో నెరవేరెను
విమోచించి నాకిచ్చితివే
పాడెదను ప్రహర్షింతును
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా           
||నా ప్రాణ||

Randi yehovanu gurchi usthahaganamu chesedhamu

రండి యేహొవాను గూర్చి
ఉత్సాహగానము చేసెదము
ఆయనేమనపోషకుడు
నమ్మదగినదేవుడని

ఆహా హల్లెలూయ - ఆహా హల్లెలూయ

కష్టనష్టములెన్నున్న
పోంగుసాగరాలెదురైనా
ఆయనేమనఆశ్రయం
ఇరుకులోఇబ్బందులో    

విరిగినలిగినహృదయముతో
దేవదేవునిసన్నిధిలో
ఆనిశముప్రార్ధించిన
కలుగుఈవులుమనకెన్నో

త్రోవతప్పినవారలను
చేరదీసేనాధుడని
నీతిసూర్యుండాయనేయని
నిత్యముస్తుతిచేయుదము

Manaki yesu maraninche

మనకై యేసు మరణించె 
మన పాపముల కొరకై
నిత్యజీవము నిచ్చుటకే 
సత్యుండు సజీవుడాయె (2)

తృణీకరింపబడె
విసర్జింపబడెను (2)
దుఃఖాక్రాంతుడాయె
వ్యసనముల భరించెను (2)
 ||మనకై||

మన యతిక్రమముల కొరకు
మన దోషముల కొరకు (2)
మన నాథుడు శిక్షనొందె
మనకు స్వస్థత కలిగె (2) 
||మనకై||

గొర్రెలవలె తప్పితిమి
పరుగిడితిమి మనదారిన్ (2)
అరుదెంచె కాపరియై
అర్పించి ప్రాణమును (2)
||మనకై||

దౌర్జన్యము నొందెను
బాధింపబడెను (2)
తననోరు తెరువలేదు
మనకై క్రయధనమీయన్ (2)

Yesu devuni ashrayinchuma

యేసు దేవుని ఆశ్రయించుమా
సోదరా సోదరీ ఈ క్షణమే
విశ్వసించుమా తండ్రిని వేడుమా
గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే
స్వస్థత లేక సహాయము లేక సాలియావా
“యేసు నామములోనే స్వస్థతే 
  యేసు కృపలోనే భద్రత
  యేసు రక్తములోనే విమోచన
  యేసే నడిపించును జీవమారాన
1. రోగియైన దాసుని కొరకు 
శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను
మాట మాత్రం సెలవిమ్మనగా
విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను
విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును 121
యేసు నందు విశ్వాసముంచుము
2. దు:ఖ స్థితిలో హన్నా తన ఆత్మను 
దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను
మొక్కుబడి చేసి ప్రార్థించెను 
దీవింపబడెను కుమారుని పొందెను
నీవు అడుగుము నీకివ్వబడును ||2||
యేసుని ప్రార్థించుము
3.శోధనలనైనా సమస్తమును కోల్పోయిన
యోబువంటి విశ్వాసం గమనించుమా
యధారత నిరీక్షించెను 
రెండంతల దీవెనలు పొందుకొనెను
సహసము చూపుము సమకూడి జరుగును
యేసు నందు నిరీక్షించుము.

Devude Naakaashrayambu

దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గము
మహా వినోదు డాపదల – సహాయుడై నన్ బ్రోచును
అభయ మభయ మభయ మెప్పు
డానంద మానంద మానంద మౌగ          ||దేవుడే||

పర్వతములు కదిలిన నీ – యుర్వి మారు పడినను
సర్వమున్ ఘోషించుచు నీ – సంద్ర ముప్పొంగినన్       ||అభయ||

దేవుడెప్డు తోడుగాగ – దేశము వర్ధిల్లును
ఆ తావు నందు ప్రజలు మిగుల – ధన్యులై వసింతురు      ||అభయ||

రాజ్యముల్ కంపించిన భూ – రాష్ట్రముల్ ఘోషించిన
పూజ్యుండౌ యెహోవా వైరి – బూని సంహరించును       ||అభయ||

విల్లు విరచు నాయన తెగ – బల్లెము నరకు నాయన
చెల్ల చెదర జేసి రిపుల – నెల్లద్రుంచు నాయనే           ||అభయ||

పిశాచి పూర్ణ బలము నాతో – బెనుగులాడ జడియును
నశించి శత్రు గణము దేవు – నాజ్ఞ వలన మడియును      ||అభయ||

కోటయు నాశ్రయమునై యా – కోబు దేవు డుండగా
ఏటి కింక వెరవ వలయు – నెప్డు నాకు బండుగ         ||అభయ||

Na vaidhyudavu

 నిన్నే నే నమ్మితీ
నీవే నా వైధ్యుడవు
నిన్నే నే నమ్మితీ
నీవే నా ఆధారము
ఏదేమైనా, ఏ స్థితియైన
నీవే నా సహాయము
ఎంతగానో వేదనతో
బలమంతా కోల్పోతిని
నిరీక్షణ నీవే దేవా
నన్ను బాగుచేయుమయ్యా
ఏ తోడు లేక చేయూత లేక
నన్నందరు విడచిపోతిరే
నా ఆధారం, ఆశ్రయం,
ఆనందం, అభయం నీవేగా
కృప చూపుము
ఈ కన్నీరంతా ప్రేమతోనే తుడచివేయుమయ్యా
దైవాత్మతో నన్ను తాకి నన్ను స్వస్థపరచుమయ్యా
యెహోవా రాఫా, యెహోవా షమ్మా
సర్వశక్తిమంతుడైన దేవా
నీకసాధ్యమైనది ఏదియు లేదని నమ్మెద
జీవింపుము